Tuesday, February 17, 2009
లిప్తకాల స్వప్నం
ఇది నా జీవితం! నాలాంటి వాళ్ళ జీవితం!!
ఆకలీ అవమానం నిండు కుండగా ఉండే దళిత జీవితానుభవమే నాకీ కవిత్వాన్నిచ్చింది.
జీవితం ఒక ఆరాటం. దళితుడి జీవితం మరీ పోరాటం.గమ్యం మరింత సంక్లిష్టం.
ఊహ తెలిసినప్పటినుండీ 'ఊహ ' కు రూపం రావటమెంత కష్టమో అనుభవించాను.
ఆ అనుభవాలు, అనుభూతులతో 'నేనూ కవిత్వమైయ్యాను.
కానీ, అన్ని 'నేను 'లు 'నేనే ' కాదు.
కవిత్వం జీవితాన్వేషణ!
కవిత్వం జీవిత సంఘర్షణ!!
ఈ జీవిత సంఘర్షణ... ఈ అన్వేషణలకేది గమ్యం?
కళ్ళెదుటనే కాటికి వెళ్ళే వాళ్ళను చూస్తున్నా, కాలాన్ని కట్టేయలేని జీవితాన్వేషణ!
గడియారం నిరంతరం తిరగాల్సిందే! ముళ్ళళ్ళో భేదాలు!!
అదొక నిరంతర ప్రయాణం! మానవుడూ నిరంతర ప్రయాణికుడే! నిరంతర అన్వేషకుడే!!
ఒకో కులం,ఒకో మతం, ఒకో మార్గం!
జీవితం ఒక నమూనా పాత్ర!
నేనూ ఒక నమూనా నయ్యాను
నా పాత్ర పొషణలోనూ రాగద్వేషాలకు అతీతుణ్ణి కాలేక పోయాను.
నేనిప్పుడు క్షణకాలపు అసహనాన్ని!
క్షణకాలపు జ్ఞాపకాన్ని!
లిప్తకాలపు స్వప్నాన్ని!!
- డా. దార్ల వెంకటేశ్వర రావు.
మళ్ళీ కవితల సూచిక దగ్గరకు
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
cheppalanukunnadi cheppede kavitwam kaadanu kuntaanu
adi, naa kavita samputiki rasukunna mundu mata. kavita kadu. mee comment lo nijayitee undi
thank you
Post a Comment