Tuesday, February 17, 2009
శంబూకిడి మీద సెప్పలేనంత ప్రేమ!
సీతాకోక చిలుకలిప్పుడు సరిహద్దు రేఖల్ని గమనిస్తూ
రెక్కల్నాడించుకోవాల్సిందేనేమో
ఏమో...
గెడ్డంతో కనిపించిన వాడల్లా
లాడెన్ వారసుడో మార్క్స్ మానస పుత్రుడో అన్నట్లే
ప్రతిరోజూ ద్వారం దగ్గర జాగిలాలు
అగ్గి పరీక్షలు నిర్వహిస్తున్నాయ్!
ప్రేమంతా తానై
ఆ ఒడిలో ఒంపేసిన సునీతను చంపేసికూడా
కాంపస్ లోనే ఆబోతులా తిరిగేవాడికి లేని
అగ్గి పరీక్షలిప్పుడు అమలైపోతున్నాయ్!
అనుమతించినా బెదురుచూపుల్తో లోనికొచ్చే
ఖాకీ వాహనాలిప్పుడు
సలాం కరోమంటూ దూసుకొచ్చేస్తున్నాయ్!
పంద్రాగస్టునాడు
కన్యత్వంపాలవాళ్ల కు 'పర్వదిన' మైపోయినప్పుడు
రాజ్ భవన్ వరకూ రోడ్డంతా కేంపస్సే!
ఆ ఆనవాల్లు కూడా హైటెక్లో అంతరించిపోయాయిప్పుడు!
నాడేమమ్యాయా అగ్నిపరీక్షల ఆలోచనలు?
ఔను
ఆ ఆలోచనలెప్పుడూ నివురుకప్పుకున్న నిప్పు కణాలే!
ఒక్కదెబ్బకు "రెండు పిట్టల్ని" కాల్చగలిగే,
కళ్ళని టార్గెట్ చేసే అమాయక వేలు కోసం తపస్సు చేసిన మహర్షులు
ఓ శంబూకుణ్ణి ప్రేమించేశారు!
-డా. దార్ల వెంకటేశ్వర రావు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment